Alia Bhatt says Ranbir Kapoor is 'constantly nervous' that Raha will forget him - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: రణ్‌బీర్‌ చాలా సెన్సిటివ్‌.. కూతురు తనను ఎక్కడ మర్చిపోతుందోనని..

Published Thu, Apr 27 2023 11:20 AM | Last Updated on Thu, Apr 27 2023 1:55 PM

Alia Bhatt Says Ranbir Kapoor is Nervous Raha Will Forget Him - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌బీర్‌​ కపూర్‌-ఆలియా భట్‌ల ముద్దుల కూతురే రాహా. సమయం దొరికితే చాలు ఇద్దరూ కూతురితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లిగా ఆలియా చాలామటుకు రాహాతోనే ఉన్నప్పటికీ తండ్రి రణ్‌బీర్‌ మాత్రం తాను ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా ఇంట్లో ఉండలేకపోతున్నాడు. అయితే ఇలా దూరంగా ఉంటే కూతురు తనను ఎక్కడ మర్చిపోతుందోనని టెన్షన్‌ పడుతున్నాడట హీరో. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కూతుర్ని ముద్దుగా అలా పిలుస్తాం..
'రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు నా కూతుర్ని చూసి నవ్వావంటే తను కూడా తిరిగి స్మైల్‌ ఇస్తుంది. రణ్‌బీర్‌, నేను తనని ముద్దుగా చీతా అని పిలుస్తాం. మాకెంత అలసటగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా తన ముఖం చూడగానే అవన్నీ పటాపంచలైపోతాయి. తనను దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కన్నా ముఖ్యమైనది మరేదీ లేదనిపిస్తుంది. కానీ రాహా కాస్త పెద్దగా అయిందంటే మా ఒడిలో ఉండిపోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. మొత్తం తిరిగేస్తానంటుంది. ఆ విషయం నాకు అర్థమైంది.

రణ్‌బీర్‌ భయమదే..
రణ్‌బీర్‌ చాలా సెన్సిటివ్‌. రాహా పుట్టాక అతడు మరింత సెన్సిటివ్‌ అయ్యాడు. కూతురంటే అతడికి ఎంతో ప్రేమ, మమకారం. అతడు ఏనుగులా లేదా మరేదైనా జంతువులా మారిపోయి రాహాను ఆడిస్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అతడున్నాడంటే రాహా నా దగ్గరకు కూడా రాదు. కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం స్పెండ్‌ చేస్తుంటాడు. అతడు పని వల్ల ఎటైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూతురు తనను మర్చిపోతుందేమోనని చాలా భయపడుతుంటాడు. అందుకే రణ్‌బీర్‌ ప్లేస్‌లో నేను కిటికీ దగ్గర కూర్చుని తనకు కబుర్లు చెప్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటాను' అని చెప్పుకొచ్చింది ఆలియా భట్‌.

చదవండి: సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ నెంబర్‌ ఇవ్వనేలేదు: అబ్దుల్‌
ఓటీటీలోకి వచ్చిన దసరా, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement