తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)
ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్' యష్ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట.
మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది.
(ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!)
Comments
Please login to add a commentAdd a comment