Alia Bhatt Admitted To Hospital Ranbir Kapoor To Welcome Baby Soon:Report - Sakshi
Sakshi News home page

Alia Bhatt : ఆసుపత్రిలో చేరిన ఆలియా.. బేబీ కపూర్‌ కోసం వెయిటింగ్‌

Published Sun, Nov 6 2022 11:00 AM | Last Updated on Sun, Nov 6 2022 11:34 AM

Alia Bhatt Admitted To Hospital Ranbir To Welcome Baby Soon - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం నిండు గర్భిణీగా ఉన్న ఆలియా మరికొద్ది గంటల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలో డెలివరీ కోసం నేడు(ఆదివాం)ఉదయం 7.30నిమిషాలకే ముంబైలోని రిలయన్స్‌ ఆసుపత్రిలో చేరింది.

ఆలియా వెంట భర్త రణ్‌బీర్‌ కపూర్‌తో పాటు నీతూ కపూర్‌, సోనీ రజ్దాన్, షాహిన్‌ భట్‌ కూడా ఉన్నారు. మరికాసేపట్లో ఆలియా, రణ్‌బీర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పనున్నారు. దీంతో కపూర్‌ ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌ ఆలియా బేబీ కోసం ఎదురుచూస్తున్నారు. బేబీ కపూర్‌కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆలియా పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. అయితే గర్భిణీగా ఉన్నా షూటింగ్స్‌తో పాటు ప్రమోషన్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది. ప్రసవం తర్వాత ఆలియా తిరిగి సినిమాల్లో నటించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement