
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పటికే ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి కూడా చేరుకున్నారు. సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్ నుంచి కారులో ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆలియా బేబీని ఇంతవరకు ఎక్కడా బయటకు చూపించలేదు. బేబీ ముఖాన్ని చూడకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈ బాలీవుడ్ జంట.
(చదవండి: కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్)
అయితే బేబీని ఇంటికి తీసుకురావడంతో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు చూసేందుకు క్యూ కట్టారు. చాలా మంది బంధుమిత్రులు ఆలియా-రణ్‌బీర్ బేబీని చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ ఆలియా క్యూట్ బేబీని చూడాలంటే ఓ షరతు విధించింది ఈ జంట. పాపను చూడాలంటే తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ కండిషన్ విధించారు. దీంతో కొద్దిమంది బంధుమిత్రులు నిరాశకు గురవుతున్నారు.
ఈ ఏడాది విడుదలైన బ్రహ్మస్త్ర-పార్ట్-1 ఘనవిజయం సాధించింది. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఈ బాలీవుడ్ జంట ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ", హాలీవుడ్ తొలి చిత్రం "హార్ట్ ఆఫ్ స్టోన్", గాల్ గాడోట్‌తో కలిసి నటించనుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment