Alia Bhatt Delivery At Mumbai Hospital Costs Rs 15000 Per Day - Sakshi
Sakshi News home page

Alia Bhatt Pregnancy: ఆలియాభట్ ప్రసవం.. ఆస్పత్రి ఖర్చు రోజుకు ఎంతో తెలుసా?

Oct 18 2022 6:12 PM | Updated on Oct 19 2022 9:07 AM

Alia Bhatt Delivery At Mumbai hospital Costs 15000 Rupees per day - Sakshi

బాలీవుడ్ నటి ఆలియా భట్ గర్భం ధరించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించనున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన ప్రకారం అలియా భట్ ఈ నెలాఖరులోపు బిడ్డకు జన్మనిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనికోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నారు రణ్‌బీర్, ఆలియా జంట. ఇందుకోసం రోజుకు రూ.15 వేలు చెల్లించేందుకు ఓ ఆస్పత్రిని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన  రాలేదు.

(చదవండి: ఘనంగా ఆలియా భట్‌ సీమంతం, ఫొటోలు వైరల్‌)

 అయితే ప్రసవం కోసం ముంబైలోని గిర్గావ్‌లో ఉన్న సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో తన పేరును నమోదు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా ద్వారా తెలిసింది. ఆస్పత్రిలో రోజుకు రూ. 15,000 వేలు ఫీజు ఉంటుందని సమాచారం. దీనిలో భాగంగా వారికి ప్రత్యేక గదులతో ఆధునాతన సదుపాయాలు కల్పిస్తారు. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించారు. కాగా.. ఆలియా హాలీవుడ్ అరంగేట్ర చిత్రం స్పై థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో కనిపించనుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' లోనూ నటిస్తోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, షబానా అజ్మీ, జయ బచ్చన్, ధర్మేంద్ర నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement