
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్‌లో కూడా బెస్ట్ కపుల్‌గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్‌లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్‌బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్‌లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది.
అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
<
ranbir kapoor & alia bhatt are goals!!! — them doing jamal kudu pic.twitter.com/LIahwVDG1y
— 🎞️ (@softiealiaa) January 28, 2024
Comments
Please login to add a commentAdd a comment