Alia Bhatt And Ranbir Kapoor Baby Girl Fake Photo And Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Alia Bhatt Baby Girl: ఆలియా భట్‌ ఆస్పత్రి వీడియో వైరల్.. కానీ..!

Published Wed, Nov 9 2022 8:11 PM | Last Updated on Wed, Nov 9 2022 9:09 PM

FIRST photo of Alia Bhatt Ranbir Kapoor baby girl Video Goes Viral - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌, రణ్‌బీర్ కపూర్ దంపతులకు ఇటీవలే పాప జన్మించిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న రణ్‌బీర్  కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్‌ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. కానీ ఇప్పటివరకు పాప ముఖాన్ని ఈ జంట ఎక్కడా చూపించలేదు. 

(చదవండి: ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా భట్‌)
 
కానీ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఆలియా భట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో బేబీని ముద్దాడుతూ ఓ మహిళ కనిపిస్తోంది. ఆ వీడియో ఆలియా ఉన్న ఆసుపత్రి నుంచి లీక్ అయిందని పలువురు భావిస్తున్నారు. కానీ ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆలియా భట్‌ కాదని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement