ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయింది. ల్యాగ్ ఉంటే అస్సలు లెక్క చేయట్లేదు. నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు చాలావరకు తమ తమ సినిమాల్ని రెండున్నర గంటల నిడివికి కాస్త అటు ఇటు ఉండేలానే చూసుకుంటున్నారు. అలాంటిది ఓ స్టార్ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడా విషయమే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.
'అర్జున్ రెడ్డి' పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. మరికొందరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుర్తొస్తాడు. ఆ సందీప్.. ఇప్పుడు 'యానిమల్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా మూడున్నర గంటల నిడివి రాబోతుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే నిజమైంది.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?)
లేటెస్ట్‌గా 'యానిమల్' సెన్సార్ జరగ్గా.. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అలానే 201 నిమిషాల నిడివితో అంటే 3 గంటల 21 నిమిషాల మూవీ ఇది అని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే.. ఈ నిడివి అనేది అస్సలు సమస్యే కాదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం మొదటికే మోసపోయే ఛాన్స్ ఉంది.
అయితే సందీప్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 'యానిమల్'తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. గురవారం (నవంబరు 23) ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ మాత్రం పెద్దలు-పిల్లల మాత్రం చూసేలా కట్ చేసినట్లు తెలుస్తోంది. అలానే పెద్ద సినిమా కాబట్టి రెండు ఇంటర్వెల్స్ ఉంటాయా? అనేది కూడా చూడాలి. ఒకవేళ నిడివితో సంబంధం లేకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లే! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే డిసెంబరు 1 వరకు ఆగితే సరి!
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment