పెళ్లిలో కోట్లు ఇచ్చావట, నిజమేనా? హీరో ఆన్సరిదే! | Ranbir Kapoor Gives Clarity On Rumour That He Paid Crores To Alia Bhatt Friends For Joota Chupai Tradition - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌కు అమ్మ నగలు గిఫ్టిచ్చేవాడిని.. పెళ్లిలో..

Published Sun, Mar 31 2024 2:47 PM | Last Updated on Sun, Mar 31 2024 5:46 PM

Ranbir Kapoor Clarifies if He Paid Crores to Alia Bhatt Friends for Joota Chupai Tradition - Sakshi

బాలీవుడ్‌ కామెడీ కింగ్‌ కపిల్‌ శర్మ 'ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో'తో వెబ్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఈ కామెడీ షో తొలి ఎపిసోడ్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఫస్ట్‌ ఎపిసోడ్‌లో యానిమల్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ గెస్టుగా వచ్చాడు. అతడి వెంట నీతూ కపూర్‌, రిద్ధిమా కపూర్‌ కూడా ఉన్నారు.

రూ.12 కోట్లు?
రణ్‌బీర్‌కు ఇక్కడ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'నీ పెళ్లిలో ఆలియా అక్కాచెల్లెళ్లకు, స్నేహితులకు డబ్బులిచ్చావట! వాళ్లు నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల దాకా డిమాండ్‌ చేశారని విన్నాం. నువ్వు బేరాలాడి దాన్ని లక్షల్లోకి తీసుకువచ్చావట, నిజమేనా?' అని కపిల్‌ అడిగాడు. దీనికి ఫక్కున నవ్వేసిన హీరో.. 'మేము ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ వాళ్లు నా షూ దాచిపెట్టాలన్నా అవి ఇంట్లోనే కదా ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు.

దీంతో కపిల్‌ తన పెళ్లి సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నా భార్య తరపు వాళ్లయితే ఏకంగా రూ.11 లక్షలడిగారని గుర్తు చేసుకున్నాడు. మీ చెల్లితో పాటు నా షూలు కూడా మీ దగ్గరే పెట్టుకోండి. అయినా నాకోసం క్షణం ఆలోచించకుండా వచ్చేంత ప్రేమ ఆమెకుంది. షూలంటారా? కావాలనుకుంటే కొత్తవి కొనుక్కుంటాను అని సరదాగా చెప్పానని పేర్కొన్నాడు. తర్వాత అందరూ అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌.. తన తల్లి నగలను.. గతంలో ప్రేమించిన ప్రియురాళ్లకు బహుమతిగా ఇచ్చినట్లు అంగీకరించాడు. కాగా రణ్‌బీర్‌- ఆలియా 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహాకు జన్మనిచ్చారు.

చదవండి: పెరిగిన 'ఫ్యామిలీ స్టార్' బడ్జెట్‌.. విజయ్‌ దేవరకొండ రెమ్యునరేషన్‌ ఎంతంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement