Mohan Bagan football team
-
LSG VS KKR: లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది. మే 20న కేకేఆర్‌తో జరగబోయే తమ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో కృనాల్ అండ్ కో ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఎల్ఎస్జీకి యజమాని అయిన సంజీవ్ గొయెంకా కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఛాంపియన్ మోహన్ బగాన్ ఫ్రాంచైజ్‌కు కూడా ప్రధాన వాటాదారు కావడంతో ఐఎస్ఎల్ ఛాంపియన్లకు ప్రత్యేక నివాళులర్పించేందుకు ప్రత్యేక జెర్సీని ధరించనున్నట్లు ఎల్ఎస్జీ యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్ అందాజ్.. ఇప్పుడు కోల్‌కతా రంగుల్లో అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ మోహన్ బగాన్ మరియు సిటీ ఆఫ్ జాయ్ (కోల్‌కతా)కు ప్రత్యేక నివాళి అని పేర్కొంది. కేకేఆర్ అభిమానుల మద్దతు కోసం.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీని ధరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 నుంచి కేకేఆర్ దాదాపుగా నిష్క్రమించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులను తమవైపు మళ్లించేందుకు ఎల్ఎస్జీ జెర్సీ మార్పునకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ధోని ఈడెన్ గార్డెన్స్‌లో (ఈ సీజన్లో) ఆడినప్పుడు, అతని గౌరవార్ధం (ఆఖరి సీజన్ అన్న ఉద్దేశంతో) కేకేఆర్ అభిమానులు పసుపు రంగు జెర్సీలు ధరించి స్టేడియంలో హంగామా చేసిన వైనాన్ని మైండ్‌లో పెట్టుకుని ఎల్ఎస్జీ యాజమాన్యం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చు. ఏటీకే మోహన్ బగాన్ ఇకపై మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్.. గత ఐఎస్ఎల్ సీజన్ ఫైనల్లో సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని మోహన్ బగాన్ (మునుపటి ఏటీకే మోహన్ బగాన్) జట్టు బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మోహన్ బగాన్ ఈ సీజన్ ఛాంపియన్‌గా అవతరించిన అనంతరం గొయెంకా.. తన జట్టు పేరును మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌గా మార్చాడు. వచ్చే సీజన్‌ను తాము ఇదే పేరుతో బరిలోకి దిగుతామని ప్రకటించాడు. చదవండి: భారత్-పాక్‌ల మధ్య టెస్ట్ సిరీస్..? -
ISL 2023: సెమీస్‌లో ముగిసిన హైదరాబాద్ ఎఫ్‌సీ పోరాటం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. సోమవారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ కూడా తొలి సెమీఫైనల్ మాదిరిగానే 0–0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు. ‘షూటౌట్’లో మోహన్ బగాన్ 4–3తో హైదరాబాద్‌ను ఓడించింది. షూటౌట్లో హైదరాబాద్ తరఫున జావో, డాను, రీగన్ సఫలంకాగా... సివెరియో, ఒగ్బెచె విఫల మయ్యారు. ఈనెల 18న గోవాలో జరిగే ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీతో మోహన్ బగాన్ ఆడుతుంది. -
బీసీసీఐ బాస్ కీలక నిర్ణయం.. 'ఆ పదవికి' రాజీనామా
Ganguly Quits ATK Mohun Bagan Director Position: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోల్‌కతాకు చెందిన ఏటీకే మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు డైరెక్టర్ పదవికి బుధవారం(అక్టోబర్ 27) రాజీనామా చేశాడు. ఐపీఎల్లో లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న RPSG గ్రూప్ యాజమాన్యంలోనే మోహన్ బగన్ జట్టు కూడా ఉండడమే ఇందుకు కారణం. బీసీసీఐ విరుద్ధ ప్రయోజనాల వివాదాన్ని నివారించేందుకు మోహన్ బగాన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు. ఈ జట్టుకు గంగూలీ డైరెక్టర్ మాత్రమే కాదు..షేర్ హోల్డర్ కూడా. కాగా, RPSG గ్రూప్ లక్నో జట్టును రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ రూ. 5625 కోట్లకు చేజిక్కించుకుంది. ఈ రెండు జట్ల చేరకతో ఐపీఎల్ 2022లో 10 జట్లు రంగంలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లను విక్రయించడం ద్వారా బీసీసీఐ రూ.12,715 కోట్లు ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
మోహన్ బగాన్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ‘నాస్డాక్’ బిల్‌బోర్డులపై క్లబ్ లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్డాక్’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్ బగాన్ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది. తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్ బగాన్ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్ చేసింది. -
ఫుట్‌బాల్ జట్టు సురక్షితం
యంగాన్ (మయన్మార్): ఏఎఫ్సీ కప్ కోసం మయన్మార్ వెళ్లిన 25 మంది సభ్యుల మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగానే ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడైంది. హోటల్లో డిన్నర్ చేసే సమయంలో భూకంపం సంభవించిందని, చిన్నగా మొదలైన ప్రకంపనల ధాటికి డిన్నర్ టేబుల్ అటూ ఇటూ ఊగడం ప్రారంభించిందని జట్టు వర్గాలు తెలిపాయి. వెంటనే జట్టు మొత్తం హోటల్ నుంచి బయటికి వచ్చేసి రోడ్‌పై నిలుచుంది. ప్రకంపనల ఆగిన తర్వాత ఆటగాళ్లు తమ గదుల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు కోల్‌కతాలో కూడా ఐపీఎల్ మ్యాచ్ టాస్ సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.