యంగాన్ (మయన్మార్): ఏఎఫ్‌సీ కప్ కోసం మయన్మార్ వెళ్లిన 25 మంది సభ్యుల మోహన్ బగాన్ ఫుట్‌బాల్ జట్టు సురక్షితంగానే ఉందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడైంది. హోటల్‌లో డిన్నర్ చేసే సమయంలో భూకంపం సంభవించిందని, చిన్నగా మొదలైన ప్రకంపనల ధాటికి డిన్నర్ టేబుల్ అటూ ఇటూ ఊగడం ప్రారంభించిందని జట్టు వర్గాలు తెలిపాయి. వెంటనే జట్టు మొత్తం హోటల్ నుంచి బయటికి వచ్చేసి రోడ్‌పై నిలుచుంది. ప్రకంపనల ఆగిన తర్వాత ఆటగాళ్లు తమ గదుల్లోకి వెళ్లిపోయారు. మరోవైపు కోల్‌కతాలో కూడా ఐపీఎల్ మ్యాచ్ టాస్ సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే స్టేడియంలోని ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.