కోల్‌కతా: డ్యూరాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఎస్‌ఎల్ ఛాంపియన్ అయిన హెచ్‌ఎఫ్‌సీ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్‌సీని 3–1 తేడాతో ఓడించింది. హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (6వ ని.లో), ఆకాశ్ మిశ్రా (45వ ని.లో), సివెరియో (69వ ని.లో) తలో గోల్ సాధించగా.. రాజస్తాన్ తరఫున మార్టిన్ చావెజ్(29ని.లో) ఏకైక గోల్ చేశాడు. గురువారం జరిగే సెమీస్‌లో హైదరాబాద్.. బెంగళూరు ఎఫ్‌సీతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment