Durand Cup Football
-
23 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్ బగాన్ క్లబ్ 1–0తో ఈస్ట్ బెంగాల్ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ క్లబ్ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్ బగాన్ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. -
‘‘ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?’’
వైరల్: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్ కప్ ఫైనల్ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆదివారం కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య డురాండ్ కప్ ఫైనల్ జరిగింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా గణేశన్. దీంతో ‘‘ఫుట్‌బాల్ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్. ఫుట్‌బాల్ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Ladies & gentlemen, bringing you Shri La. Ganeshan, honorable Governor of West Bengal. #DurandCup The high-headedness is audacious. Not expected of a respectable figure, @LaGanesan. A public apology surely won't be too much to ask for. #IndianFootballpic.twitter.com/aEq4Yq6a6R — Debapriya Deb (@debapriya_deb) September 18, 2022 This is what happened with shivshakti minutes before Chhetri. pic.twitter.com/TZmLP93Sdj — Akansh (@AkanshSai) September 18, 2022 -
Durand Cup: ముంబైని ఓడించి తొలిసారి విజేతగా బెంగళూరు.. ప్రైజ్‌మనీ ఎంతంటే
Durand Cup 2022 Final- కోల్‌కతా: భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్ టోర్నీ డ్యూరాండ్ కప్ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది. బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్ -
Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ
కోల్‌కతా: డ్యూరాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ అయిన హెచ్ఎఫ్సీ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్‌సీని 3–1 తేడాతో ఓడించింది. హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (6వ ని.లో), ఆకాశ్ మిశ్రా (45వ ని.లో), సివెరియో (69వ ని.లో) తలో గోల్ సాధించగా.. రాజస్తాన్ తరఫున మార్టిన్ చావెజ్(29ని.లో) ఏకైక గోల్ చేశాడు. గురువారం జరిగే సెమీస్‌లో హైదరాబాద్.. బెంగళూరు ఎఫ్‌సీతో తలపడనుంది. -
హైదారాబాద్ ఎఫ్సీకి షాక్.. లీగ్ దశలోనే అవుట్!
భారత్‌లో అత్యంత పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌గా పేరొందిన డ్యూరాండ్ కప్ నుంచి హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 1–2తో ఆర్మీ రెడ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నిర్ణీత మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ ఒక విజయం, రెండు ఓటములతో తమ గ్రూప్‌లో మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చదవండి: CSK vs MI: గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్.. చెన్నైదే పైచేయి -
డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత ఆర్మీ గ్రీన్
న్యూఢిల్లీ: ఆసియాలో అతి పురాతన, ప్రపంచంలో మూడో పురాతన ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్‌లో ఆర్మీ గ్రీన్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 6-5తో నెరోకా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. నిర్ణీత 90 నిమిషాలు, ఆ తర్వాత అదనపు 30 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. విజేతగా నిలిచిన ఆర్మీ గ్రీన్ జట్టుకు రూ. 45 లక్షలు... రన్నరప్ నెరోకా జట్టుకు రూ. 20 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. 2006 తర్వాత డ్యూరాండ్ కప్‌ను ఆర్మీ జట్టు గెలవడం ఇదే ప్రథమం. 1888లో మొదలైన డ్యూరాండ్ కప్‌లో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ 16 సార్లు చొప్పున విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టు నాలుగుసార్లు ఈ టోర్నీ టైటిల్‌ను సాధించింది.