Durand Cup: ముంబైని ఓడించి తొలిసారి విజేతగా బెంగళూరు.. ప్రైజ్‌మనీ ఎంతంటే | Durand Cup 2022: Bengaluru FC Beat Mumbai FC Win Title | Sakshi
Sakshi News home page

Durand Cup 2022: ముంబైని ఓడించి తొలిసారి విజేతగా బెంగళూరు.. ప్రైజ్‌మనీ ఎంతంటే

Published Mon, Sep 19 2022 10:13 AM | Last Updated on Mon, Sep 19 2022 10:21 AM

Durand Cup 2022: Bengaluru FC Beat Mumbai FC Win Title - Sakshi

Durand Cup 2022 Final- కోల్‌కతా: భారత్‌లో అత్యంత పురాతన ఫుట్‌బాల్‌ టోర్నీ డ్యూరాండ్‌ కప్‌ టైటిల్‌ను బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) తొలిసారి సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని బెంగళూరు 2–1తో ముంబై సిటీ ఎఫ్‌సీపై గెలిచింది.

బెంగళూరు తరఫున శివశక్తి (10వ ని.లో), అలన్‌ కోస్టా (61వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... ముంబై జట్టుకు అపుయా (30వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. చాంపియన్‌ బెంగళూరు కు రూ. 60 లక్షలు... రన్నరప్‌ ముంబై జట్టుకు రూ. 40 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  

చదవండి: India Women vs England Women 2022 1st ODI: మెరిసిన స్మృతి, హర్మన్‌ప్రీత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement