అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ త్వరలోనే పారిస్ సెయింట్ జెర్మెన్(PSG Club) వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఎస్‌జీ క్లబ్ మేనేజర్ క్రిస్టొఫీ గాల్టియర్‌తో గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ పీఎస్‌జీ క్లబ్ కొనసాగేందుకు ఇష్టంగా లేడని.. త్వరలోనే తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది.
శనివారం పీఎస్‌జీ క్లబ్ నిర్వహించిన ట్రెయినింగ్ సెషన్‌కు మెస్సీ హాజరుకాలేదని.. గాల్టియర్‌తో పొసగకనే మెస్సీ తన హాటల్ రూంకే పరిమితమయ్యాడని తెలిపింది. మేనేజర్‌తో మెస్సీకి పొసగడం లేదన్న వార్తలు నిజమేనని మెస్సీ తండ్రి పేర్కొనడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది.
కాగా మెస్సీ 2021లో పీఎస్‌జీతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జూన్‌తో మెస్సీకి పీఎస్‌జీతో కాంట్రాక్ట్ ముగియనుంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకుంటాడా లేక బయటికి వస్తాడా అనేది ఆసక్తికంగా మారింది. అంతకముందు 2004 నుంచి 2021 వరకు 17 ఏళ్ల పాటు మెస్సీ స్పానిష్ క్లబ్ బార్సిలోనాకు ఆడాడు. ఒకవేళ పీఎస్‌జీ నుంచి బయటికి వస్తే మెస్సీ కచ్చితంగా మళ్లీ బార్సిలోనా గూటికే చేరే అవకాశం ఉంది.
అయితే మెస్సీ పీఎస్‌జీ వీడనున్నట్లు వస్తున్న వార్తలకు మరో కారణం ఉంది. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపెతో మెస్సీ రిలేషన్ అంతగా బాగా లేదని.. ఇద్దరు స్టార్స్ ఒకేచోట ఇమడలేకపోతున్నారంటూ సమాచారం. ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషిన్‌షిప్ దెబ్బ తిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పీఎస్‌జీలోకి వచ్చిన తర్వాత మెస్సీ ప్రయాణం అనుకున్నంత గొప్పగా ఏమి సాగడం లేదు. దీంతో అతను బయటికి రావడానికి ఇది కూడా ఒక కారణమని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
I'm sorry but Messi is definitely bigger than PSG https://t.co/wASmdHD9hz
— Liam (@ThatWasMessi) March 18, 2023
Comments
Please login to add a commentAdd a comment