
ముంబై: ఐ–లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) వరుసగా రెండో విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన పోరులో శ్రీనిధి జట్టు 2–1తో ఇండియన్ ఆరోస్‌పై గెలుపొందింది. మ్యాచ్ అసాంతం శ్రీనిధి ఆటగాళ్ల హవానే కొనసాగింది.
తొలి అర్ధభాగంలో ఛాంగ్తే (30వ ని.) చేసిన గోల్‌తో ఎస్‌డీఎఫ్‌సీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఇండియన్ ఆరోస్ తరఫున రోడ్రిగ్స్ (45+4వ ని.) గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం శ్రీనిధి ఆటగాడు డేవిడ్ మునోజ్ (69వ ని.) గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. శ్రీనిధి తదుపరి మ్యాచ్ శ్రీనిధి జట్టు... చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ (గోవా)తో తలపడుతుంది.
చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment