
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్ధమాన ఫుట్‌బాల్ ఆటగాడు ఎన్. ఆదర్శ్‌కు అరుదైన అవకాశం దక్కింది. సబ్ జూనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటి న ఆదర్శ్ స్పెయిన్‌లోని ప్రఖ్యాత సీడీ ఒలింపిక్ డి జటీవా ఎ క్లబ్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు క్లబ్ తరఫున ఆడనున్నాడు. 17 ఏళ్ల ఆదర్శ్ ఎంపికపై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జీపీ ఫల్గుణ ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment