
బెంగళూరు: భారత ఫుట్‌బాల్ ప్లేయర్ బాలా దేవి అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. విఖ్యాత స్కాట్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్‌సీకి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. బాలా దేవి తమ జట్టుతో 18 నెలలు పనిచేయనుందని పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్రొఫెషనల్ పుట్‌బాలర్‌గా మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల బాలా దేవి నిలిచింది.
ఆసియా తరఫు నుంచి రేంజర్స్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. భారత జట్టుకు గతంలో కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ 2010 నుంచి ఇప్పటివరకు 52 గోల్స్‌ను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment