Journalist Says Brazil Star Neymar Accused Ruining PSG Drunk in Training - Sakshi
Sakshi News home page

Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్‌ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు

Published Thu, Mar 24 2022 5:48 PM | Last Updated on Thu, Mar 24 2022 7:38 PM

Journalist Says Brazil Star Neymar Accused Ruining PSG Drunk In Training - Sakshi

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెయ్‌మర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ట్రెయినింగ్‌ సెషన్‌కు తాగి వచ్చాడని.. అంతేగాక ప్రాక్టీస్‌ సమయంలోనూ తాగుతూ కనిపించాడంటూ ఆర్‌ఎంసీ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ డేనియల్‌ రియోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేనియల్‌ రియోలో వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

''కొంతకాలంగా నెయ్‌మర్‌ ఆశించిన విధంగా రాణించడం లేదు. పైగా ప్రాక్టీస్‌ సెషన్‌లకు తాగి వస్తున్నాడు. జట్టును మొత్తం సర్వ నాశనం చేస్తున్నాడు. పీఎస్‌జీ ఫ్యాన్స్‌ కూడా నెయ్‌మర్‌ ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. వెంటనే అతన్ని జట్టును నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారంటూ'' తెలిపాడు. 

కాగా చాంపియన్స్‌ లీగ్‌లో రియల్‌ మాడ్రిడ్‌ చేతిలో పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌ ఓడిపోయినప్పటి నుంచి ఏది కలిసిరావడం లేదు. వరుసగా ఇటీవలే ఆడుతున్న అన్ని మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూస్తూ వచ్చింది. తాజాగా లీగ్‌ 1లో భాగంగా మొనాకోతో జరిగిన మ్యాచ్‌లో పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌(పీఎస్‌జీ) 3-0 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా నెయ్‌మర్‌ 2017లో బార్సిలోనా నుంచి పారిస్‌ సెయింట్స్‌ జెర్మన్‌(పీఎస్‌జీ)కు మారాడు. 

చదవండి: PAK vs AUS: స్టీవ్‌ స్మిత్‌ అరుదైన ఫీట్‌.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!

Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement