fifth time
-
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
World Athletics Championships 2022: షెల్లీ... జగజ్జేత మళ్లీ
యుజీన్ (అమెరికా): మూడు పదుల వయసు దాటినా... ఒక మగబిడ్డకు తల్లి అయినా... విజయకాంక్ష ఉంటే అత్యున్నత వేదికపై అదరగొట్టడం సుసాధ్యమేనని జమైకా మేటి అథ్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ నిరూపించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 35 ఏళ్ల షెల్లీ ఆన్ ఫ్రేజర్ ఎవరికీ సాధ్యంకాని ఘనతను నమోదు చేసింది. మహిళల 100 మీటర్ల విభాగంలో షెల్లీ రికార్డుస్థాయిలో ఐదోసారి పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే ఈవెంట్లో ఐదు స్వర్ణ పతకాలు గెలిచిన తొలి అథ్లెట్‌గా షెల్లీ కొత్త చరిత్ర లిఖించింది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల ఫైనల్లో షెల్లీ 10.67 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి జగజ్జేతగా నిలిచింది. జమైకాకే చెందిన షెరికా జాక్సన్ (10.73 సెకన్లు) రజతం, ఎలైని థాంప్సన్ హెరా (10.81 సెకన్లు) కాంస్యం గెలుపొందారు. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి మహిళల 100 మీటర్ల విభాగంలో ఒకే దేశానికి చెందిన ముగ్గురు అథ్లెట్స్ ఖాతాలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు చేరాయి. గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలోనూ జమైకా క్లీన్‌స్వీప్ చేసింది. ‘టోక్యో’లో షెరికా స్వర్ణం, షెల్లీ రజతం, ఎలైని థాంప్సన్ కాంస్యం సాధించారు. ►5: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో షెల్లీ నెగ్గిన స్వర్ణాలు. 2009 (బెర్లిన్), 2013 (మాస్కో), 2015 (బీజింగ్), 2019 (దోహా) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ షెల్లీకి పసిడి పతకాలు లభించాయి. ►12: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వివిధ విభాగాల్లో షెల్లీ నెగ్గిన మొత్తం పతకాలు. అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్స్ జాబితాలో షెల్లీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అలీసన్ ఫెలిక్స్ (అమెరికా; 19 పతకాలు), మెర్లీన్ ఒట్టి (జమైకా; 14 పతకాలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
ఐదోసారి సీఎంగా నవీన్
భువనేశ్వర్: ఒడిశా శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఐదోసారి విజయఢంకా మోగించిన బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మే 29వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆయన వరుసగా ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. అంతకుముందు బీజేడీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సుమారు 45 నిమిషాలు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నవీన్ పట్నాయక్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్‌ను కలసిన నవీన్ పట్నాయక్.. ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ గణేషి లాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నవీన్ పట్నాయక్‌ను ఆహ్వానించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 146 శాసనసభ స్థానాలకు గాను 112 సీట్లలో బీజేడీ విజయం సాధించింది. బీజేపీ 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైంది. పాట్కూరా శాసనసభ స్థానంలో అభ్యర్థి మరణం, ఫోణి తుపాను కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దేశంలో మోదీ గాలి వీస్తున్పప్పటికీ రాష్ట్రంలో మాత్రం 23 సీట్లకే బీజేపీ పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ అదనంగా 13 స్థానాల్ని గెలుచుకొని ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. నిరాడంబర వ్యక్తిత్వం నిరాడంబర జీవనశైలి, సాదాసీదా ఆహార్యం, సాత్వికాహారం రాజీలేని పనితీరు ఒడిశాలో వరుసగా అయిదు పర్యాయాలు అధికారాన్ని నిలుపుకున్న నవీన్ పట్నాయక్ వ్యవహార శైలి. రాష్ట్రానికి చాలాకాలం దూరంగా ఉండటంతో మాతృభాష ఒడియాపై పట్టులేకున్నా కష్టించి పని చేయడంపై మమకారమే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ఐదేళ్లు పాటు పాలించిన నేతలు తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొం టున్న ప్రస్తుత రాజకీయాల్లో సుమారు 19 ఏళ్ల పాటు అధికారాన్ని నిలుపుకుని.. మరోసారి సీఎంగా గెలిచిన ఘనత ఆయన సొంతం. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు.. జననం.. విద్యాభ్యాసం.. ఒడిశా దివంగత ముఖ్యమంత్రి, జనతా దళ్ నేత బిజు పట్నాయక్, గ్యాన్ పట్నాయక్ దంపతుల కుమారుడైన నవీన్ పట్నాయక్ ఒడిశాలోని కటక్ ప్రాంతంలో అక్టోబర్ 16, 1946లో జన్మించారు. డెహ్రాడూన్‌లోని వెల్హం బాలుర పాఠశాల, డూన్ పాఠశాలల్లో ఆయన ప్రాథమిక విద్య నభ్యసించారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాల యానికి చెందిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. పాఠశాల స్థాయి నుంచే ఆయన చరిత్ర, ఆయిల్ పెయింటింగ్, అథ్లెటిక్స్‌పై మక్కువ పెంచుకున్నారు. డూన్ స్కూల్లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నవీన్ మూడేళ్ల జూనియర్. ఒడిశా రాష్ట్రానికి, రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ .. తండ్రి మరణంతో అమెరికా నుంచి తిరిగివచ్చి 1996లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. -
‘ఆపరేషన్ స్మైల్’ ఐదో దఫా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు, బాల కార్మిక వ్యవస్థలో నిర్బంధంగా పనిచేస్తున్న మైనర్లు, వ్యభిచార కూపాల్లో బాల్యాన్ని బంధీగా చేయబడ్డ బాలికలను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్ ఐదో దఫా కార్యక్రమం సోమవారం ప్రారంభమైం ది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్, మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సుమతి, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి ప్రారంభించారు. 22 వేల మంది రెస్క్యూ.. గత 4 దఫాల ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రెస్క్యూ చేశాయి. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈసారీ అదే రీతిలో పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్టు ఐజీ స్వాతి లక్రా తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్ స్మైల్ కోసం రంగంలోకి దించుతున్నామని చెప్పారు. వీరందరికి సోమవారం అవగాహన, రెస్క్యూ ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఫేసియల్ రికగ్నైజేషన్.. రెస్క్యూ సందర్భంగా గుర్తించిన చిన్నారులు, మైనర్లు వారి వారి వివరాలు చెప్పేందుకు భయపడటం లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని, ఇలాంటి సందర్భంలో రాష్ట్ర పోలీస్ శాఖ రూపొం దించిన ‘దర్పన్’ ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని శిక్షణలో అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా అదృశ్యమైన వారి వివరాల డేటా బేస్ అందుబాటులో ఉంటుం దని, చిన్నారుల ఫొటోలను సరిపోల్చి అడ్రస్, ఇతర వివరాలు గుర్తించనున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేసి తల్లిదం డ్రులకు పిల్లలను అందజేయడం సులభంగా ఉం టుందని శిక్షణలో ఉన్నతాధికారులు సూచించారు. నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతుందని, ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఐడీ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. -
జొకోవిచ్ ఐదోస్సారి
చైనా ఓపెన్ టైటిల్ సొంతం బీజింగ్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఐదోసారి చైనా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన ఐదు పర్యాయాలు ఈ సెర్బియా స్టార్కే టైటిల్ దక్కడం విశేషం. గతంలో జొకోవిచ్ 2009, 2010, 2012, 2013లలో కూడా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-0, 6-2తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను అలవోకగా ఓడించి కెరీర్లో 45వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. చాంపియన్ జొకోవిచ్‌కు 6,04,000 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రాంబో’ యాక్షన్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించనవసరంలేదు. సిల్వెస్టర్ స్టాలోన్‌ను హాలీవుడ్ సూపర్ స్టార్ చేసిన సినిమాలు అవి. రాంబో పాత్రను స్టాలోన్ మొదటిసారి పోషించిన చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’. 1982లో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో ఆయన చేసిన పోరాట దృశ్యాలు చూసి, ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఈ చిత్రానికి లభించిన ఆదరణతో ఆ తర్వాత మరో మూడు రాంబో సిరీస్ చిత్రాల్లో నటించారు స్టాలోన్. ఆ విధంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు వచ్చాయి. నాలుగోది 2008లో విడుదలైంది. ఈ నాలుగు రాంబో చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదోసారి రాంబోగా కనబడటానికి స్టాలోన్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా ఆయనే సమకూరుస్తున్నారు. మొదటిసారి జాన్ రాంబో పాత్ర చేసినప్పుడు స్టాలోన్ వయసు దాదాపు 36 ఏళ్లు. ఇప్పుడాయన వయసు 67. మరి.. ఈ వయసులో పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయం స్టాలోన్‌కి తెలియకేం కాదు. కానీ, తన అభిమానులను నిరుత్సాహపరచకూడదనే పట్టుదలతో ఈ సినిమా కోసం వర్కవుట్లు చేస్తున్నారట స్టాలోన్. -
ఆయన ఆ పదవిని 5వ సారి అలంకరిచబోతున్నారు!
గ్యాంగ్టాక్: పవన్ చామ్లింగ్ అయిదవసారి సిక్కిం ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. ఈ నెల 21 బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ సారథిగా చామ్లింగ్‌ను 22 మంది ఎమ్మెల్యేలు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 16 నాటి ఎన్నికల ఫలితాల్లో 32 మంది సభ్యులున్న సిక్కిం అసెంబ్లీలో 22 చోట్ల ఎస్డీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువకాలం 23 ఏళ్లపాటు సీఎంగా జ్యోతి బసు రికార్డును సృష్టించారు. వరుసగా ఐదో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించనున్న చామ్లింగ్ ఆ రికార్డును అధిగమించాలంటే మూడేళ్లలో అధిగమించనున్నారు.