జొకోవిచ్ ఐదోస్సారి | Djokovic won for fifth time | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ ఐదోస్సారి

Published Mon, Oct 6 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

జొకోవిచ్ ఐదోస్సారి

జొకోవిచ్ ఐదోస్సారి

చైనా ఓపెన్ టైటిల్ సొంతం

 బీజింగ్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఐదోసారి చైనా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆడిన ఐదు పర్యాయాలు ఈ సెర్బియా స్టార్‌కే టైటిల్ దక్కడం విశేషం. గతంలో జొకోవిచ్ 2009, 2010, 2012, 2013లలో కూడా విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6-0, 6-2తో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను అలవోకగా ఓడించి కెరీర్‌లో 45వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. చాంపియన్ జొకోవిచ్‌కు 6,04,000 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement