సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) తొలి ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే తమ జట్టు వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుందని హెచ్‌ఎఫ్‌సీ సహ యజమాని, సినీనటుడు దగ్గుబాటి రానా చెప్పారు. ఐఎస్‌ఎల్‌లో ఈ సీజన్‌కు కొద్ది రోజుల ముందే తమ జట్టు కొత్తగా వచి్చందని, జట్టు కోసం వరుణ్ (సహ యజమాని) ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పారు. ‘ఈ సీజన్‌లో నిరాశ ఎదురైనా... సానుకూల దృక్పథంతో వచ్చే సీజన్ కోసం కష్టపడతాం. క్లిష్టమైన ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలిచేందుకే నేను వచ్చాను. కొన్ని మార్పులు, చేర్పులతో జట్టు పటిష్టంగా తయారవుతుంది.
వచ్చే సీజన్‌లో మా జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న నమ్మకం నాకుంది’ అని రానా వివరించారు. మరో సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ రానా ఇచి్చన మద్దతును మరిచిపోలేమని, అలాంటి ఉత్తేజం ఇచ్చేవారు తమ జట్టులో ఉండటం ఎంతో లాభిస్తుందని చెప్పారు. వచ్చే సీజన్‌లో తమ జట్టు నూతనోత్సాహంతో బరిలోకి దిగుతుందని, సంతృప్తికర ఫలితాలు సాధిస్తుందని అన్నారు. 2019–20 సీజన్‌లో బరిలోకి దిగిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ 16 మ్యాచ్‌లాడి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 12 మ్యాచ్‌ల్లో ఓడగా... మరో 3 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. దీంతో కోచ్ ఫిల్ బ్రౌన్‌ను తప్పించిన యాజమాన్యం వచ్చే రెండు సీజన్ల కోసం అల్బెర్ట్ రోకాను హెడ్ కోచ్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment