సెమీస్‌లో గోవా ఎఫ్‌సీ | goa fc sails into semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో గోవా ఎఫ్‌సీ

Published Mon, Nov 30 2015 2:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

goa fc sails into semis

కొచ్చి: రినాల్డో డి క్రుజ్ (29, 50, 61వ నిమిషాల్లో) హ్యాట్రిక్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఎఫ్‌సీ గోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా 5-1తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఐఎస్‌ఎల్ బయటి మ్యాచ్‌ల్లో ఇదే అతి పెద్ద విజయం. రినాల్డో హ్యాట్రిక్‌తో పాటు జోఫ్రి (12వ ని.), దేశాయ్ (64వ ని.)లు గోవా తరఫున గోల్స్ చేశారు.

 

పుల్గా (2వ ని.) కేరళకు ఏకైక గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో కేరళ పది మందితోనే ఆడటం జట్టుపై ప్రభావం చూపింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లతో 22 పాయింట్లు సాధించిన గోవా జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కేరళ 12 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement