న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం గోవా ఎఫ్సీ జట్టు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించినందుకు రూ. 11 కోట్ల భారీ జరిమానా పడింది. దీంతో పాటు ఆ ఫ్రాంచైజీ యజమానులు దత్తరాజ్ సాల్గాకోర్పై మూడు సంవత్సరాలు, శ్రీనివాస్ డెంపోపై రెండు సంవత్సరాలు నిషేధాన్ని విధించింది. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ఐఎస్ఎల్ కమిషన్ సుదీర్ఘంగా విచారించిన అనంతరం గురువారం గోవా ఎఫ్సీపై చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తంలో రూ. 10 కోట్లను ఫుట్ బాల్ స్పోర్ట్ డెవలప్ మెంట్(ఎఫ్ఎస్డీఎల్) ఇవ్వాలని ఐఎస్ఎల్ కమిషన్ స్పష్టం చేసింది.
ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా ఆటగాళ్లు, అధికారులు రిఫరీని చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారు. మ్యాచ్ ఫిక్సయిందంటూ నానా హంగామా స్పష్టించారు. మరోవైపు జట్టు యజమాని సాల్గాకోర్ ను చెన్నైయిన్ ఎఫ్సీ ఆటగాడు ఎలానో బ్లమర్ దూషించాడంటూ ఆరోపించింది. దీనిలో భాగంగా ఆ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని కూడా గోవా ఎఫ్సీ బహిష్కరించింది.
గోవా ఎఫ్సీకి రూ.11 కోట్ల జరిమానా
Published Thu, May 5 2016 10:05 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement