కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్‌ఫోర్ట్ | ISL 2016: Kerala Blasters register narrow win over Delhi Dynamos in first leg of semis | Sakshi
Sakshi News home page

కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్‌ఫోర్ట్

Published Mon, Dec 12 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్‌ఫోర్ట్

కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్‌ఫోర్ట్

కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఎగబడ్డారు. సుమార్ 50 వేల మంది ప్రత్యక్షంగా తిలకించిన ఈ మ్యాచ్‌లో కేరళ సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించింది. హోమ్ గ్రౌండ్‌లో సచిన్ జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం.
 
 ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకై క గోల్‌ను బెల్‌ఫోర్ట్ 65వ నిమిషంలో సాధించి కేరళకు అద్భుత విజయాన్నందించాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఒక్క గోల్ అయిన లేకుండానే ఈ సెషన్ ముగిసింది. అనంతరం రెండో అర్ధభాగంలో బెల్‌ఫోర్ట్ అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచడంతో కేరళ గెలుపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement