
గోవా, పుణే మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో భాగంగా శుక్రవారం ఎఫ్‌సీ గోవా, ఎఫ్‌సీ పుణే సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే ద్వితీయార్దంలో 47వ నిమిషంలో పుణే ఆటగాడు జాన్సన్ సెల్ఫ్ గోల్ చేయడంతో గోవాకు 1-0 ఆధిక్యం దక్కింది. కానీ 64వ నిమిషంలో పుణే ఆటగాడే లింగ్డో చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. నేటి మ్యాచ్‌లో కేరళ, చెన్నైయిన్ తలపడతాయి.