దుబాయ్ లో ఎఫ్ సీ గోవా కసరత్తు
మరి కొద్ది రోజుల్లో రెండో సీజన్ ప్రారంభం కానుండటంతో ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ లన్నీ విదేశీ ఆటగాళ్ల వేటలో పడ్డాయి. కొత్త ఒప్పందాలతో బిజీగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఎఫ్ సీ గోవా స్ట్రైకర్ డెరిల్ డఫ్పీ తో ఒప్నందం కుదుర్చుకుంది. తమ టీమ్ లో ఖాళీగా ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్, అడిషనల్ ప్లేయర్ స్థానాల కోసం రెండు డీల్స్ కుదుర్చుకుందని మేనేజ్ మెంట్ మీడియాకు తెలిపింది.
ఇదిలా ఉంటే డఫ్పీ కేవలం ఐసీఎల్ సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. సీజన్ ముగిసిన వెంటనే స్వంత క్లబ్ కు తిరిగి వెళ్లనున్నాడని తెలుస్తోంది. మరో వైపు గోవా తమ టీమ్ లోని ఎనిమిది మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కోటా పూర్తి కావడంతో.. అడిషనల్ ప్లేయర్ కోటాలో పూనే డిఫెండర్ లూసియానో సబ్రోసాను తెచ్చుకుంది. ఆటగాళ్ల ఎంపిక పూర్తి కావడంతో ఎఫ్ సీ గోవా టీమ్ ప్రీ సెషన్ ట్రైనింగ్ కోసం ఇవాళ దుబాయ్ బయల్దేరి వెళ్లనుంది.