
'ప్రేమతో చెబుతున్నా.. విజయం మాదే'
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) విజయవంతం కావడం భారత ఫుట్ బాల్ కు ఎంతో అవసరమని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అభిప్రాయపడ్డారు.నార్త్ ఈస్ యునైటెడ్ ఫుట్ బాల్ యజమాని అయిన జాన్ మాట్లాడుతూ..'మాకు గొప్ప మద్దతు ఉంది. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు.అయితే ఒక్కటి మాత్రం నిజం. మేము గట్టి పోటీని ఎదుర్కొవాల్సి ఉంది' అని తెలిపారు.
ప్రేమతో చెబుతున్నా.. విజయం మాత్రం మాదే అని స్పష్టం చేశాడు. రేపు జరుగనున్న ఐసీఎల్ పోరులో తమ జట్టు కేరళ బ్లాస్టర్స్ తో తలపడనుందన్నారు. . అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్‌ఎల్ లో పలువురు ప్రముఖ క్రికెటర్లు భాగస్వామ్యం అయ్యారు. కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ, చెన్నై జట్టులో వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు.