
కోల్ కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలనుకున్నా:షారుక్
కోల్ కతా: ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నాడు. అదేదో సినిమా గురించి కాదండోయ్. ఐఎస్ఎల్ సాకర్ టీం లో కోల్ కతా జట్టను కొనుగోలు చేయలేనందుకు తెగ బాధపడితున్నాడు. వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా.. కోల్ కతాను మాత్రమే తాను కొనుగోలు చేయాలనుకున్నాడట. దీనిపై షారుక్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'కోల్ కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేకపోవడం నిజంగా దురదృష్టం. ఐఎస్ఎల్ లో ఉండాలనుకున్నా. అది కూడా కోల్ కతా జట్టునే కొనుగోలు చేయాలనుకున్నా. కోల్ కతా ను కొనుగోలు చేయలేనప్పడు వేరే జట్టు అనవసరం అనుకున్నా' అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ లో కోల్ కతా ప్రాంఛైజీని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ, హర్షవర్ధన్ నియోతియా, సంజీవ్ గోయంక తదితరులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.