న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు మళ్లీ చుక్కెదురైంది. ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్)లో భాగంగా నార్త్‌ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 0-1 గోల్ తేడాతో ఓడిపోయింది. ఆట 77వ నిమిషంలో వెలెజ్ చేసిన గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన నార్త్‌ఈస్ట్ జట్టు చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం పుణే సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా 0-1తో ఓడింది.
గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 2-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో పుణే జట్టు ఆడుతుంది.
కోల్‌కతాకు మళ్లీ షాక్
Published Sat, Oct 24 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM
Advertisement
Advertisement