సమయం.. స్వల్పం–లక్ష్యం..దూరం
Published Thu, Mar 23 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
వీరవాసరం: స్వచ్ఛభారత్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టింది. దీనిలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బహిరంగ మలవిసర్జన నేరంగా పరిగణిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే రేషన్, పింఛన్లు వంటి పథకాలు నిలుపుచేస్తామని కూడా చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాలకు సన్నాహాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తుండగా జిల్లాలో 13,757 మరుగుదొడ్లు నిర్మాణానికి నోచుకోలేదు.
జిల్లాలో లక్ష్యం 1,73,197
పూర్తయినవి 1,36,611
నిర్మాణంలో ఉన్నవి 23,011
నిర్మాణం చేపట్టనవి 13,757
గడువు 9 రోజులు
ఇక తొమ్మిది రోజులే..
2016–17లో జిల్లావ్యాప్తంగా 1,73,197 వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం పూర్తిచేసింది. వాటిలో 1,36,611 పూర్తి కాగా మరో 23,011 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా 13,575 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి. మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు మండల స్థాయిల్లో అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. అయినా ప్రజల్లో అవగాహన లోపం, చైతన్యలేమి కారణంగా నిర్మాణానికి ముందుకు రావడం లేదు. జిల్లాలో కేవలం భీమడోలు, తణుకు మండలాల్లో మాత్రమే నూరు శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి.
నిర్మాణాలు ఇలా..
మండలం మంజూరైనవి పూర్తయినవి
చింతలపూడి 6341 2486
లింగపాలెం 3648 1303
టి.నరసాపురం 3501 1425
కామవరపుకోట 3877 2218
పోడూరు 2975 1636
గోపాలపురం 4117 2340
పోలవరం 4276 3158
కొవ్వూరు 4266 3170
తాడేపల్లిగూడెం 5575 4420
గణపవరం 3739 3283
ఇరగవరం 2600 1869
తాళ్లపూడి 3303 2439
పెరవలి 2859 2210
బుట్టాయగూడెం 4610 3084
మొగల్తూరు 4166 2316
నరసాపురం 4846 3415
పెదవేగి 9376 8084
దేవరపల్లి 4155 2903
పెదపాడు 4475 3293
జంగారెడ్డిగూడెం 2504 1936
జీలుగువిులి్ల 3005 1923
ఆచంట 2871 2479
ఉండ్రాజవరం 2630 2073
అత్తిలి 2287 1856
పెనుమంట్ర 2784 2262
భీమవరం 3077 2022
పెంటపాడు 4439 3979
నిడమర్రు 1750 1632
ఉంగుటూరు 5681 5324
ఏలూరు 4671 4320
కాళ్ల 4216 4076
చాగల్లు 2259 2028
యలమంచిలి 3022 3150
పాలకొల్లు 2095 1809
పాలకోడేరు 4218 4062
దెందులూరు 5069 4660
నల్లజర్ల 7822 7779
వీరవాసరం 2730 2282
పెనుగొండ 2834 2756
కొయ్యల గూడెం 3488 2901
ఆకివీడు 3529 3420
నిడదవోలు 2765 2680
ద్వారకాతిరుమల 2846 2791
ఉండి 3299 3268
భీమడోలు 1745 1745
తణుకు 2356 2346
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం
బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలు చేయడం కోసం అన్ని విధాలా కృషిచేస్తున్నాం. ప్రజల్లో అవగాహన, ప్రేరణ కల్పిస్తున్నాం. అయినా వినకుంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో రేషన్, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాం. వీరవాసరం మండలంలో 27 మాత్రమే ప్రారంభం కాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. ఈనెల 25 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి తీరతాం.
– పి.జగదాంబ, ఎంపీడీవో, వీరవాసరం
Advertisement