చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్ | ISL, Chennaiyin FC rope in Dhoni as co-owner | Sakshi
Sakshi News home page

చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్

Published Mon, Oct 6 2014 10:23 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్ - Sakshi

చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్

ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చాడు. భారత కెప్టెన్ ధోని చెన్నైయన్ ఎఫ్‌సీ జట్టులో వాటా కొనుగోలు చేశాడు. ఈ జట్టుకు యజమాని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. ‘చెన్నైయన్ ఎఫ్‌సీలో సహ యజమానిగా ధోని ఒప్పందంపై సంతకం చేశాడు’ అని లీగ్ నిర్వాహణ సంస్థ ఐఎంజీ-రిలయన్స్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు.

 

ఇప్పటికే కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు. తాజాగా ధోని చేరికతో ఈ ఫుట్‌బాల్ లీగ్‌కు క్రికెట్ గ్లామర్ మరింత పెరిగింది. అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్‌ఎల్ జరుగునుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement