
నేడు అఫ్గానిస్తాన్‌తో భారత్ పోరు
అభా (సౌదీ అరేబియా): ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్‌లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్‌తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment