world cup qualifying tourny
-
విజయమే లక్ష్యంగా...
అభా (సౌదీ అరేబియా): ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్‌లో నెగ్గి, ఒక మ్యాచ్‌లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్‌కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్‌తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. -
వేలంలో రొనాల్డో ఆర్మ్బ్యాండ్కు రూ. 55 లక్షలు
బెల్గ్రేడ్: పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రిఫరీ నిర్ణయంపై ఆగ్రహంతో మైదానంలో విసిరేసిన కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్ (చేతికి ధరించేది) 64 వేల యూరోల (రూ. 55 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా గత ఆదివారం పోర్చుగల్, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆట అదనపు సమయంలో తాను కొట్టిన గోల్‌ను రిఫరీ నిరాకరించడంతో ఆగ్రహించిన రొనాల్డో... తన చేతికి ఉన్న నీలి రంగు ఆర్మ్‌బ్యాండ్‌ను విసిరేశాడు. అనంతరం ఆ బ్యాండ్‌ను తీసుకున్న ఫైర్ ఫైటర్ ఒక చారిటీ సంస్థకి అందజేశాడు. వాళ్లు దానిని ఆన్లైన్ వేలంలో ఉంచడంతో ఒక అభిమాని పెద్ద మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా వచ్చిన డబ్బును వెన్నెముక వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి చికిత్స కోసం వినియోగిస్తామని ఆ చారిటీ సంస్థ తెలిపింది. -
జింబాబ్వే కెప్టెన్, కోచింగ్ స్టాఫ్‌పై వేటు
హరారే: వన్డే ప్రపంచకప్–2019కు అర్హత సాధించడంలో జింబాబ్వే జట్టు విఫలమవడంతో కెప్టెన్ గ్రేమ్ క్రేమర్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌పై వేటు పడింది. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన జింబాబ్వే పై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. క్రేమర్ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్ టేలర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. హెడ్ కోచ్ హీత్ స్ట్రీక్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్, బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో, ఫీల్డింగ్ కోచ్ వాల్టర్ చవగుట, ఫిట్నెస్ కోచ్ సీన్ బెల్, అనలిస్ట్ స్టాన్లె చీజాలతో పాటు శిక్షణ బృందాన్ని తక్షణమే తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. వీరితో పాటు సెలక్షన్ కమిటీ కన్వీనర్ తతేంద తైబు, అండర్–19 కోచ్ స్టీఫెన్ మాన గోంగోలను కూడా వారి పదవుల నుంచి తొలగించింది. 1979 తర్వాత జింబాబ్వే ప్రపంచకప్‌నకు అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. -
అసలైన క్రీడాస్పూర్తి ఇదే.!
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు క్రీడా అభిమానులకు వెగటు పుట్టిస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్లు కనీస క్రీడా స్పూర్తి మరిచి ప్రవర్తిస్తున్నారు. జట్టు విజయం కోసం ఎలాంటి అడ్డదార్లు తొక్కడానికైనా సిద్దపడుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌కు చేయాలని ఆటగాళ్లు ప్రోత్సహించడం ప్రపంచ వ్యాప్తంగాతీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇక అంతక ముందు దక్షిణాఫ్రికా బౌలర్ రబడ వికెట్ తీసిన ఆనందంలో స్మిత్‌ను ఢీకొట్టడం.. వార్నర్- డికాక్‌ల వివాదం.. నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌లతో అతిగా ప్రవర్తించడం వంటి ఘటనలు చూసి అసలేమైంది ఈ క్రికెటర్లకు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ ఆటగాళ్లు చూపించిన క్రీడా సూర్తి.. వివాదాల్లో చిక్కుకున్న ఆటగాళ్లందరికి ఆదర్శంగా నిలుస్తోంది. అవును అభిమానులు, క్రీడా విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో విండీస్‌పై పసికూన అఫ్గానిస్తాన్ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓడినా ఏ మాత్రం బాధపడని విండీస్ ఆటగాళ్లు అఫ్గాన్ ఆటగాళ్లతో మైదానంలో చిందేశారు. ‘ఇది అసలైన క్రీడాస్పూర్తి’ అని ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. -
విండీస్ ఆటగాళ్ల క్రీడాస్పూర్తిపై ఐసీసీ ప్రశంస
-
అఫ్గానిస్తాన్ అద్భుతం
హరారే: సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని అఫ్గానిస్తాన్ జట్టు నిరూపించింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ... తొలిసారి క్వాలిఫయింగ్ టోర్నీ చాంపియన్‌గా అవతరించింది. వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో అఫ్గాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట విండీస్ 46.5 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. గేల్ (10) మళ్లీ విఫలంకాగా... పావెల్ (44; ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (38; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ముజీబ్ 4, నైబ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన అఫ్గాన్ 40.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షహజాద్ (84; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), రెహ్మత్ షా (51; 4 ఫోర్లు) రాణించారు. రషీద్ ఖాన్ రికార్డు ఈ మ్యాచ్‌లో హోప్ వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో, అతి పిన్న వయసులో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్గాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల 186 రోజుల రషీద్ 44వ వన్డేలో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (52 వన్డేలు) పేరిట ఈ రికార్డు ఉంది. -
యూఏఈపై అఫ్గానిస్తాన్ విజయం
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్‌సిక్స్‌లో యూఏఈపై 5 వికెట్లతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ముందుగా యూఏఈ 43 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. అన్వర్ (64), నవీద్ (45) రాణించారు. రషీద్ ఖాన్ 5 వికెట్లతో చెల రేగాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 34.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (74 నాటౌట్), నజీబుల్లా జద్రాన్ (63 నాటౌట్) రాణించారు. 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు అభేద్యమైన ఆరో వికెట్‌కు 124 పరుగులు జతచేసి జట్టును గెలిపించారు. -
అఫ్గానిస్తాన్ గట్టెక్కింది!
బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సోమవారం అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన మ్యాచ్ జరగలేదు. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా వచ్చింది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో నేపాల్ గెలవడంతో అఫ్గాన్ ముందంజ వేసింది. సూపర్ సిక్స్‌కు అర్హత సంపాదించింది. గ్రూప్ ‘బి’లో ఈ మూడు జట్లు ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో అఫ్గాన్ ‘సూపర్’ బెర్తు దక్కించుకుంది. సోమవారం జరిగిన పోరులో నేపాల్ 5 వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై నెగ్గింది. మొదట హాంకాంగ్ 48.2 ఓవర్లలో 153 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ (47) ఆకట్టుకున్నాడు. తర్వాత నేపాల్ 40.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ కుమార్ (48 నాటౌట్), సోమ్‌పాల్ కామి (37 నాటౌట్) రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 54 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలువగా, ఐర్లాండ్ 226 పరుగుల భారీ తేడాతో యూఏఈపై ఘనవిజయం సాధించింది. జింబాబ్వే, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గ్రూప్ ‘ఎ’ నుంచి వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ, ‘బి’ నుంచి జింబాబ్వే, స్కాట్లాండ్, అఫ్గానిస్తాన్ సూపర్ సిక్స్‌కు అర్హత పొందాయి. ఈ నెల 15 నుంచి సూపర్ పోరు జరుగుతుంది. -
పాక్ కు షాక్: ఫైనల్లో భారత్
కొలంబో:ఐసీసీ మహిళల ప్రపంచకప్ వన్డే క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన సూపర్ సిక్స్ పోరులో భారత్ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలుత పాకిస్తాన్ 67 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడు వికెట్లు కోల్పోయి 22.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.దాంతో ఈ మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ బెర్తును ఖాయం చేసుకోవాలనుకున్న పాక్ ఆశలకు గండిపడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(19), బిస్మా మారుఫ్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేయగా, మిగతా జట్టంతా సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. భారత బౌలర్ ఏక్తా బిస్త్ బౌలింగ్ దెబ్బకు పాక్ విలవిల్లాడింది. ఏక్తా బిస్త్ 10 ఓవర్లలో 7 మెయిడెన్ల సాయంతో 8 పరుగులివ్వడమే కాకుండా ఐదు వికెట్లను సాధించి పాక్ పతనాన్ని శాసించింది. ఎక్స్ట్రా రూపంలో వచ్చిన 24 పరుగులకే పాక్ స్కోరు బోర్డులో అత్యధికం కావడం ఇక్కడ విశేషం. ఆ తరువాత 68 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించి భారత మహిళలు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకున్నారు.ఓపెనర్ మెష్రామ్(9) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, దీప్తి శర్మ(29 నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్(24)లు రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఇది సూపర్ సిక్స్ దశలో భారత్ కు మూడో విజయం కాగా, అంతకుముందు లీగ్ దశలో నాలుగు విజయాల్ని సాధించింది. తద్వారా ఈ టోర్నీలో భారత్ వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. మరొకవైపు సూపర్ సిక్స్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తుది పోరుకు అర్హత సాధించింది.ఈ నెల 21వ తేదీన ఫైనల్ జరుగునుంది.