హరారే: సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని అఫ్గానిస్తాన్ జట్టు నిరూపించింది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ... తొలిసారి క్వాలిఫయింగ్ టోర్నీ చాంపియన్‌గా అవతరించింది. వెస్టిండీస్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో అఫ్గాన్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట విండీస్ 46.5 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. గేల్ (10) మళ్లీ విఫలంకాగా... పావెల్ (44; ఫోర్, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (38; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ముజీబ్ 4, నైబ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన అఫ్గాన్ 40.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి గెలుపొందింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షహజాద్ (84; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), రెహ్మత్ షా (51; 4 ఫోర్లు) రాణించారు.
రషీద్ ఖాన్ రికార్డు
ఈ మ్యాచ్‌లో హోప్ వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో, అతి పిన్న వయసులో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అఫ్గాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 19 ఏళ్ల 186 రోజుల రషీద్ 44వ వన్డేలో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (52 వన్డేలు) పేరిట ఈ రికార్డు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment