బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సోమవారం అఫ్గానిస్తాన్‌కు సంబంధించిన మ్యాచ్ జరగలేదు. కానీ ఫలితం మాత్రం అనుకూలంగా వచ్చింది. హాంకాంగ్‌తో జరిగిన పోరులో నేపాల్ గెలవడంతో అఫ్గాన్ ముందంజ వేసింది. సూపర్ సిక్స్‌కు అర్హత సంపాదించింది. గ్రూప్ ‘బి’లో ఈ మూడు జట్లు ఒక్కో విజయంతో రెండేసి పాయింట్లు సాధించాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో అఫ్గాన్ ‘సూపర్’ బెర్తు దక్కించుకుంది. సోమవారం జరిగిన పోరులో నేపాల్ 5 వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై నెగ్గింది.
మొదట హాంకాంగ్ 48.2 ఓవర్లలో 153 పరుగులు చేసింది. నిజాకత్ ఖాన్ (47) ఆకట్టుకున్నాడు. తర్వాత నేపాల్ 40.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ కుమార్ (48 నాటౌట్), సోమ్‌పాల్ కామి (37 నాటౌట్) రాణించారు. ఇతర మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 54 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై గెలువగా, ఐర్లాండ్ 226 పరుగుల భారీ తేడాతో యూఏఈపై ఘనవిజయం సాధించింది. జింబాబ్వే, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. గ్రూప్ ‘ఎ’ నుంచి వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ, ‘బి’ నుంచి జింబాబ్వే, స్కాట్లాండ్, అఫ్గానిస్తాన్ సూపర్ సిక్స్‌కు అర్హత పొందాయి. ఈ నెల 15 నుంచి సూపర్ పోరు జరుగుతుంది.
అఫ్గానిస్తాన్ గట్టెక్కింది!
Published Tue, Mar 13 2018 1:01 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment