
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్‌సిక్స్‌లో యూఏఈపై 5 వికెట్లతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ముందుగా యూఏఈ 43 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. అన్వర్ (64), నవీద్ (45) రాణించారు. రషీద్ ఖాన్ 5 వికెట్లతో చెల రేగాడు.
అనంతరం అఫ్గానిస్తాన్ 34.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బదిన్ నైబ్ (74 నాటౌట్), నజీబుల్లా జద్రాన్ (63 నాటౌట్) రాణించారు. 54 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు అభేద్యమైన ఆరో వికెట్‌కు 124 పరుగులు జతచేసి జట్టును గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment