మేడిపల్లిలో పూజలు చేసే వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
జగిత్యాలక్రైం: క్షుద్రపూజలు, బాణామతి, మంత్రతంత్రాల స్థావరాలపై జిల్లా పోలీసులు ఆదివారం ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్, మల్లాపూర్ మండలం వేంపేట శివారు, మేడిపల్లి మండలం కేంద్రం, కోరుట్ల పట్టణంలోని పలువురు ఇళ్లు, పూజాప్రాంతాలపై మధ్యా హ్నం 3.30గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు దాడులు చేశారు. ఆయా ప్రాంతాల్లో 78మందిని అదుపులోకి తీసుకు న్నారు.
విచారణ అనంతరం నిందితులను తహసీల్దార్ల ఎదు ట బైండోవర్ చేశారు. కాగా, మంత్రాల నెపంతో జగిత్యాల టీఆర్ నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కొడుకులను ప్రత్య ర్థులు ఇటీవల దారుణంగా హతమార్చారు. రాయికల్ మం డలం జగన్నాథపూర్ గ్రామంలో మంత్రాలు, క్షుద్రపూజలు చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోకుంటే మరణ శిక్ష తప్ప దని బహిరంగంగా ప్రకటిస్తూ కొందరు ఇటీవల ఫ్లెక్సీ ఏర్పా టు చేయడం సంచలనం సృష్టించింది.
మూఢనమ్మకాలతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, దొంగ బాబాలు, దొంగ పూజారులు, మాయగాళ్లు ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటూ, డబ్బు దండుకుంటూ సమాజంలో భయభ్రాం తులు సృష్టిస్తున్నారని కొంతకాలంగా ఫిర్యాదులు వెల్లువెత్తు తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా పోలీసుశాఖ.. రహ స్య ప్రణాళికతో జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. ఈ సందర్భంగా ఎస్పీ సింధూశర్మ మా ట్లాడుతూ మంత్రాల పేరిట ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment