రామసముద్రం : భూతవైద్యం పేరుతో అమాయకురాలికి వాతలు పెట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెద్దకురప్పల్లెకు చెందిన కృష్ణప్ప, మీనాక్షి దంపతుల కుమార్తె లావణ్యకుమారి మదనపల్లెలో పాలిటెక్నిక్ చదువుతోంది. కొంతకాలంగా లావణ్యకు మతిస్థిమితం తప్పింది. రాత్రివేళ కేకలు వేస్తుండడంతో తల్లిదండ్రులు పలుచోట్ల చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. దయ్యం పట్టిందని భావించి స్థానికుల సూచనల మేరకు కర్ణాటక సరిహద్దులోని గూకుంట గ్రామంలోని చర్చి వద్ద్దకు తీసుకెళ్లారు. అక్కడ పాస్టర్ జయప్ప అమ్మాయికి గాలి ఉందని, తాను తొలగిస్తానని నమ్మించాడు. గత వారం అక్కడికి వెళ్లి రాత్రీపగలు అక్కడే ఉన్నారు. తిరిగి చర్చి పక్కన గుట్ట వద్దకు లావణ్యను తీసుకెళ్లి భూతాన్ని తొలగిస్తానని చెప్పిన పాస్టర్ వాతలు పెట్టాడు. వాతలను చూసిన తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ శివశంకర్‌ను వివరణ కోరగా, తమకు ఫిర్యాదు రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment