వ్యక్తిగత విభేదాలతో మంత్రాలు చేశాడంటూ ఓ వ్యక్తి పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం తందులూరులో చోటుచేసుకుంది. వివరాలివీ.. గ్రామ మాజీ సర్పంచి చిన్న సంజీవరాయుడి కాలికి ఇటీవల కాలిపై పుండు అయింది. దీనికి పొరుగింట్లో ఉండే హుస్సేన్ మంత్రాలు చేయటమే కారణమని అతని అనుమానం. దీనికి తోడు హుస్సేన్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న హుస్సేన్‌పై కత్తితో దాడి చేశాడు. గాయపడిన హుస్సేన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మంత్రాల నెపంతో కత్తితో దాడి
Published Wed, Oct 5 2016 9:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement
Advertisement