
సీఎం జయకు చేతబడి?
లండన్ పత్రిక డైలీమెయిల్‌లో కథనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలితపై కొందరు చేతబడి చేయడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ లండన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు తమకీ విషయం తెలిపినట్టు ఆ పత్రిక పేర్కొంది. డీఎంకేలోని కొందరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చుచేసి చేతబడి చేసి ఉండవచ్చని, అలాగే అన్నాడీఎంకేలో సీఎం అంటే గిట్టనివారు కూడా ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొంది.
కరుణానిధి అనారోగ్యం వెనుక కూడా తాంత్రిక శక్తులు అవకాశముందని కూడా జ్యోతిష్కుడు తెలిపినట్లు వార్త కథనంలో ఉంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినందున సాధారణ వార్డులోకి మార్చుతారని తెలిసింది.
పతకం అమ్మకు అంకితం
అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో విజేతగా తాను సాధించిన పతకాన్ని సీఎం జయలలితకు అంకితమిస్తున్నట్లు ప్రముఖ ఆటగాడు ధరమ్‌రాజ్ సేరలాథన్ తెలిపారు.