Daily mail
-
తాను వేసిన ఉచ్చులో..
లండన్: చైనాకు సమీపంలోని ఎల్లో సముద్రంలో పశ్చిమ దేశాల జలాంతర్గాములను నిరోధించడానికి తాను వేసిన ఉచ్చులో డ్రాగన్ దేశానికి చెందిన అణు జలాంతర్గామి చిక్కుకుంది. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ రహస్య నివేదిక తమ దగ్గర ఉందని డెయిలీ మెయిల్ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆగస్టులో ఎల్లో సముద్రంలో చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ఉంది. ఆక్కడికి అమెరికా, బ్రిటన్ల జలంతర్గాములు రాకుండా చైనా ఏర్పాటు చేసిన యాంకర్ ఉచ్చులో దాని సబ్‌మెరైన్ చిక్కుకుందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం ఎలా జరిగిందంటే.. ! ఈ సబ్‌మెరైన్ ప్రమాదానికి సంబంధించి యూకే ఇంటెలిజెన్స్ సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం ఎల్లో సముద్రంలో ఆగస్టు 21 ఉదయం 8.12 గంటల సమయంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన అణు జలంతర్గామి 093 చిక్కుకుపోయింది. అమెరికా, దాని మిత్రపక్షాల జలాంతర్గాముల్ని అడ్డుకోవడానికి వేసిన యాంకర్ చైన్‌ను డ్రాగన్ జలంతర్గామి ఢీ కొట్టడంతో అందులో ఎయిర్ ఫ్యూరిఫయర్, ఎయిర్ ట్రీట్మెంట్ వ్యవస్థలు ఆగిపోయి ఉండవచ్చు. సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న సిబ్బంది ఆరుగంటల సేపు శ్రమించి ప్రత్యామ్నాయ వ్యవస్థకు మార్చినా ఫలితం లేకుండా పోయింది. జలాంతర్గామిలో ఉన్న ఆక్సిజన్ విషతుల్యమై హైపాక్సియా అనే పరిస్థితి ఏర్పడి అందులో ప్రయాణిస్తున్న 55 మంది ఉసురు తీసింది. మృతి చెందిన వారిలో జలాంతర్గామి కెప్టెన్ కల్నల్ జీ యాంగ్పెంగ్ సహా 22 మంది అధికారులు, ఏడుగురు ఆఫీసర్ కేడెట్స్, 9 మంది పెట్టీ ఆఫీసర్స్, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఆగస్టులో ఈ ప్రమాదం గురించి కొన్ని అంతర్జాతీయ పత్రికలు రాసినా అప్పట్లో చైనా, తైవాన్లు దీనిని తోసిపుచ్చాయి. జలంతర్గాముల్లో హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థలు ఉంటాయి. బహుశా చైనా జలాంతర్గామిలో ఆ వ్యవస్థ లేకపోయి ఉండవచ్చునని బ్రిటన్ నిపుణులు చెబుతున్నట్టుగా డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో సబ్మెరైన్నుంచి ఎన్క్రిప్టెడ్ ఆటోమేటిక్ సిగ్నల్ పొరుగు దేశాలకు అందాయని బ్రిటన్ నిపుణులు వెల్లడించారు. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగం మధ్యలో వెళ్లిపోయారు. అధ్యక్షుడు ప్రసంగ పాఠాన్ని ఆ దేశ వాణిజ్య మంత్రి కొనసాగించారని, ఈ ప్రమాదమే దానికి కారణమన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్‌గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్‌ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్‌గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్‌లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్‌లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్‌లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్‌గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్‌లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్‌గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్‌తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్‌గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ -
ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే!
సింపుల్‌గా ఒక చిన్న లైన్ చెప్పారు.. కథ రెడీ అయిపోయింది.. పాత్రలు ఎలా ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో చెప్పారు.. రేంజ్ సినిమా సిద్ధమైపోయింది.. పిల్లలను బడికి పంపారు.. రోబో టీచర్ వచ్చి పాఠాలు చెప్పింది.. ఏదో పనిమీద బయటికి వెళ్లి బస్సెక్కారు.. పక్కనే ఓ రోబో వచ్చి కూర్చుని పలకరించింది.. ఇవన్నీ జస్ట్ ఏడెనిమిదేళ్లలో.. అంటే 2030 సంవత్సరానికల్లా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వాస్తవంలోకి వచ్చేస్తాయట. ఇవేకాదు అమెరికా, యూకేలకు చెందిన ఏఐ నిపుణులు ఇలాంటి మరెన్నో అంచనాలను వెలువరించారు. అందులోకీలకమైన ఎనిమిదింటిని ప్రఖ్యాత డెయిలీ మెయిల్ వెబ్సైట్ తాజాగా ప్రచురించింది. ఒక్క రోజులో సినిమా.. భవిష్యత్తులో కృత్రిమ మేధ సాంకేతికత కేవలం ఒక్కరోజులోనే మొత్తం సినిమాను రెడీ చేసి ఇచ్చే స్థాయికి చేరుతుందని న్యూయార్క్‌కు చెందిన ప్రఖ్యాత సైన్స్–ఫిక్షన్ రచయిత హఫ్ హోవే అంచనా వేశారు. ‘‘ప్రస్తుతం మేం వాడుతున్న కొన్ని ఏఐ ప్రోగ్రామ్‌లు నిజమైనవా, కల్పితమా అని తెలియని స్థాయిలో అద్భుతమైన ఫొటోలను సృష్టిస్తున్నాయి. అదే రెండేళ్ల కింద ఈ స్థాయి లేదు. ఇప్పుడు సినిమాలను సృష్టించే ఏఐ ప్రోగ్రామ్‌లు కూడా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. కొన్నేళ్లలో కేవలం ఒక్కరోజులోనే సినిమాలను సృష్టించగలవు..’’అని చెప్పారు. ఏఐ ప్రోగ్రాములు ఇప్పటికే కథలు రాసేస్తున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు తగినట్టుగా ఏఐ పాఠాలు ఒక్కో విద్యార్థికి సంబంధించి వారిలో ఉన్న లోపాలు, అభిరుచులు, మెరుగుపడాల్సిన అంశాలకు తగినట్టుగా.. వేర్వేరుగా పాఠాలను బోధించే ఏఐ రోబోలు రానున్నాయని లండన్‌లోని రావెన్స్బోర్న్ యూనివర్సిటీ కంప్యూటింగ్ అండ్ బిజినెస్ విభాగం హెడ్ అజాజ్ అలీ చెప్పారు. దీనితోపాటు అగుమెంటెడ్ రియాలిటీ (ఏఐ)తో వర్చువల్ తరగతులు, పాఠాలు కూడా.. విద్యార్థులకు అద్భుతమైన శిక్షణను ఇస్తాయని అంచనా వేశారు. అందరి సంపద జూమ్ ఏఐ సాయంతో.. అవసరాలకు, వ్యక్తులకు తగిన ఉత్పత్తుల రూపకల్పన జరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని లండన్‌కు చెందిన ‘బిగ్ ఫోర్’అకౌంటెన్సీ సంస్థ అనలిస్టులు పేర్కొన్నారు. వచ్చే ఏడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా 45శాతం పెరుగుతుందని.. ఇది భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను కలిపినదానికంటే ఎక్కువని అంచనా వేశారు. ఇంధన కొరతకు చెక్ త్వరలో ఏఐ సాయంతో క్లిష్టమైన అణు సంలీనం (న్యూక్లియర్ ఫ్యుజన్) సాంకేతికత అందుబాటులోకి వస్తుందని చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్‌మ్యాన్ చెబుతున్నారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభాలు వంటి పరిస్థితుల్లో ఇంధనం, కరెంటు కొరత సమస్యగా మారిందని.. 2030 నాటికి ఏఐ ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు. -
డోంట్ కేర్.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది. ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా! -
ట్రంప్ మెలానియా విడాకులు?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు. చాలా కాలంగా విభేదాలు! అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్హౌస్కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. చదవండి: ‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ -
ప్రియాంక, నిక్ జోనస్ సంపాదనెంతో తెలుసా?
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ల ప్రేమాయణం త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. వీరిద్దరి నిశ్చితార్థం అయిపోయినట్టు అమెరికన్ మీడియా ధృవీకరించింది. గత వారం ప్రియాంక చోప్రా పుట్టిన రోజు నాడు, నిక్ జోనస్‌తో ఆమె నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్ మీడియా చెబుతోంది. వెరీ స్పెషల్ కారణంతో, ప్రియాంక, భరత్ అనే చిత్రం నుంచి తప్పుకున్నారని.. నిక్, ప్రియాంకల పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ సినిమా డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ ట్వీట్ చేయడంతో, వీరి వివాహంపై ఈ డైరెక్టర్ కూడా పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక, నిక్ జోనస్‌ల సంపాదనెంత ఉండొచ్చు అనే దానిపై రిపోర్టులు వెలువడుతున్నాయి. ప్రియాంక, జోనస్‌లు వారి వారి రంగాల్లో అగ్రగామిలో ఉన్నారు. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ప్రియాంక 97వ స్థానంలో ఉన్నారు. 2017 నవంబర్ నాటికి ఆమె సంపాదన సుమారు 10 మిలియన్ డాలర్లు అంటే రూ.64 కోట్లు ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. మరోవైపు డైలీ మెయిల్ అంచనాల ప్రకారం నిక్ జోనస్ సంపాదన 25 మిలియన్ డాలర్లని అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.171 కోట్లగా ఉందని తెలిసింది. ఈ రిపోర్టులు వెలువడి కొన్ని రోజులే కావడంతో, వీరి సంపాదనలో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకుని ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీంతో మొత్తంగా కలిపి ప్రియాంక, నిక్ జోనస్‌ల సంపాదన రూ.235 కోట్లని వెల్లడవుతోంది. కాగ, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ కథ 2017 మెట్ గలాలో మొదలైంది. నిక్ జోనస్, ప్రియాంక కంటే పదేళ్ల చిన్న. ఇటీవలే నిక్ జోనస్‌ను ప్రియాంక భారత్‌కు తీసుకుని వచ్చి, తన కుటుంబానికి పరిచయం చేసింది. నిక్ జోనస్ కూడా ప్రియాంకను వారి కుటుంబానికి పరిచయం చేయడంతో, వారి ప్రేమ కథకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ పడిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. -
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ జరిగిపోయాందా?
-
సీఎం జయకు చేతబడి?
లండన్ పత్రిక డైలీమెయిల్లో కథనం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలితపై కొందరు చేతబడి చేయడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ లండన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్కుడు తమకీ విషయం తెలిపినట్టు ఆ పత్రిక పేర్కొంది. డీఎంకేలోని కొందరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చుచేసి చేతబడి చేసి ఉండవచ్చని, అలాగే అన్నాడీఎంకేలో సీఎం అంటే గిట్టనివారు కూడా ఈ దురాగతానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొంది. కరుణానిధి అనారోగ్యం వెనుక కూడా తాంత్రిక శక్తులు అవకాశముందని కూడా జ్యోతిష్కుడు తెలిపినట్లు వార్త కథనంలో ఉంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడినందున సాధారణ వార్డులోకి మార్చుతారని తెలిసింది. పతకం అమ్మకు అంకితం అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో విజేతగా తాను సాధించిన పతకాన్ని సీఎం జయలలితకు అంకితమిస్తున్నట్లు ప్రముఖ ఆటగాడు ధరమ్‌రాజ్ సేరలాథన్ తెలిపారు. -
వారంతా వరాహాలట!
తిరిగినన్ని రోజులూ తిరిగేసి... చేయాల్సినవన్నీ చేసేసి... ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్స్‌ను బండ బూతులు తిడుతోంది హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్. వాళ్లిచ్చిన లవ్ ట్విస్ట్‌లకు షాకై... వెక్సై... చివరకు మగాళ్లందరూ వరాహాలనేసింది! బిల్లీ జేన్, జాసన్, డానీ సిప్రియానీ.. వీరంతా ఒకప్పటి బ్రూక్ ప్రియులు. ‘డానీతో ఎపిసోడ్ ముగుస్తున్న సమయంలో జాసన్ కాల్ చేశాడు. నువ్వంటే నాకింకా ప్రేమే అన్నాడు. నేనూ తనంటే ఇష్టమన్నా. కానీ తరువాత అర్థమైంది... అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను వదిలేశాడని. అందుకే మళ్లీ నా వెంట పడుతున్నాడని. మగాళ్లందరూ ఇంతే.. వరాహాలు’ అంటూ ‘డైలీ మెయిల్’తో వాపోయింది. -
గేమింగ్ పిచ్చి ఆడవాళ్లకు ఎక్కువా?
కంప్యూటర్ గేమ్స్ మీద మహిళలకు మక్కువ ఎక్కువట. ఏ మాత్రం తీరిక దొరికినా ఆన్లైన్లో గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారట ఎక్కువ మంది మహిళలు. నేటి నగర జీవితంలో కంప్యూటర్ అందుబాటులో ఉండి, దానిపై పరిజ్ఞానం ఉన్న వారిలో 50 శాతం మంది తీరిక వేళల్లో గేమ్స్ ఆడటాన్ని వినోదంగా భావిస్తున్నారట. డెయిలీ మెయిల్లో ప్రచురితం అయిన ఈ సర్వే ప్రకారం పురుషుల కన్నా మహిళల్లోనే ఈ గేమ్స్‌పై ఎక్కువ ఆసక్తి ఉంది. ఇంతవరకు సాధారణంగా టీవీ సీరియల్స్, సినిమాలే మహిళలకు ప్రధాన వినోదమార్గాలు అనే అభిప్రాయాలున్నాయి. అయితే దాదాపుగా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన తరుణంలో కంప్యూటర్ గేమ్స్‌నే తమ వినోదమార్గంగా భావిస్తున్నారు చాలామంది మహిళలు. అయితే ఇది ఆందోళనకరమైన పరిణామం అని అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. ఇలా కంప్యూటర్ గేమ్స్‌కు బానిస అయిపోవడం కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని వారు అంటున్నారు. -
కింగ్మేకర్లుగా జగన్, జయ, మమత
-
కింగ్మేకర్లుగా జగన్, జయ, మమత
కేంద్రంలో హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు వీరి మద్దతు కీలకం ఏపీ సమైక్యంగా ఉంటే జగన్‌కు 30 సీట్లు ‘డైలీ మెయిల్’ ప్రత్యేక కథనం లండన్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వస్తే పరిస్థితి ఏమిటి? ప్రతిపాదనల్లోనే ఉన్న మూడో కూటమి సాకారం కాకుండా.. యూపీఏ, ఎన్డీఏలు ఎక్కువ సీట్లు గెలుచుకుని మెజారిటీ లేక అధికార పీఠానికి చేరువలో ఉండిపోతే ఎవరు కింగ్మేకర్లు అవుతారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నపై రాజకీయ నాయకులు అంతే ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తున్నారు. హంగ్ ఫలితాలు వస్తే.. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లుగా మారి చక్రం తిప్పుతాయని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే అవకాశముందంటున్నారు. ఈమేరకు వారి విశ్లేషణలతో బ్రిటన్ నుంచి వెలువడే ‘డైలీ మెయిల్’ పత్రిక శనివారం ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. అందులోని ముఖ్యాంశాలు.. 42 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ నుంచి మమత, 40 స్థానాలున్న తమిళనాడు నుంచి జయ మద్దతు లేకుండా యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఈ మూడు రాష్ట్రాల్లోని 120కిపైగా సీట్లు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం కానున్నాయి. ఏపీలో అశేష ప్రజాదరణతో ముందుకు దూసుకెళ్తున్న జగన్ పార్టీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుంది. ఏపీ సమైక్యంగా ఉంటే వైఎస్సార్సీపీకి 30కిపైగా సీట్లు దక్కుతాయి. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 25 సీట్లకుగాను 15 నుంచి 18 సీట్లు అత్యంత సులభంగా వస్తాయి. దీంతో కేంద్రంలో సర్కారు ఏర్పాటులో జగన్ పాత్ర కీలకం అవుతుంది. ఇక బెంగాల్లో ఇటీవలే స్థానిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తృణమూల్ కూడా గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది. తమిళనాడులో జయ పార్టీ కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఈ పార్టీల మద్దతూ కీలకంగా మారుతుంది. ఎన్నికల తర్వాత జయ, మమతలు యూపీఏ, ఎన్డీఏల్లో దేనివైపు మొగ్గుతారనేదానిపైనా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్న జయ.. యూపీఏతోనూ దోబూచులాడుతున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆమె ప్రధాని మన్మోహన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడం, ఇటీవల ఇద్దరు కేంద్రమంత్రులు పాల్గొన్న సభలకు తన కేబినెట్ మంత్రులిద్దరు వెళ్లడానికి అభ్యంతర చెప్పకపోవడం దీనికి రుజువంటున్నారు. యూపీఏతో గొడవపడి తెగతెంపులు చేసుకున్న మమత బీజేపీకి దగ్గరయ్యే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింల మద్దతు పోగొట్టుకోవడానికి ఆమె సిద్ధపడకపోవచ్చని, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వంటి అవసరాల కోసం జాగ్రత్తగా పావులు కదుపుతారని విశ్లేషిస్తున్నారు.