మగబిడ్డ కోసం అత్తాకోడళ్ల దారుణం | Woman And Mother In Law Hacked Boy For Male Child | Sakshi
Sakshi News home page

దోషులకు మరణ శిక్ష విధించిన కోర్టు

Aug 18 2020 2:38 PM | Updated on Aug 18 2020 4:05 PM

Woman And Mother In Law Hacked Boy For Male Child - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పాట్నా : మగబిడ్డ పుడతాడన్న మూఢనమ్మకంతో నాలుగేళ్ల మగ పిల్లాడిని బలి ఇచ్చిన ఘటనలో అత్తాకోడళ్లకు మరణశిక్ష విధించింది కోర్టు. దోషులిద్దరికీ ఉరిశిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి లవ్‌కుశ్‌ కుమార్ సోమవారం‌ తీర్పునిచ్చారు. 2017 సెప్టెంబర్‌ 5న గోపాల్‌గంజ్‌ జిల్లాలోని చితౌనాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మగపిల్లాడు లేని సన్‌కేశా అనే మహిళ మగ పిల్లాడిని బలి ఇస్తే తనకు బాబు పుడతాడని నమ్మింది. ఇందుకోసం అత్త దుర్గావతి సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి అదే ప్రాంతంలో ఉండే కుమార్‌ అనే నాలుగేళ్ల పిల్లాడిని బలి ఇచ్చారు. అనంతరం శవాన్ని ఇంటికి కొద్ది దూరంలో విసిరేశారు. కొద్దిరోజుల తర్వాత దర్యాప్తులో భాగంగా వీరి ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు రక్తపు బట్టలు, వేట కొడవళ్లు లభించాయి. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement