మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టిచంపారు.
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టిచంపారు. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందాపురం నర్సయ్య(65) మంత్రాలు చేస్తున్నాడని, ఆయన కారణంగానే తమ కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురయ్యారని గ్రామానికే చెందిన మల్లయ్యకు అనుమానం.
ఈ నేపథ్యంలోనే నర్సయ్యను మంగళవారం రాత్రి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆనంద్‌కుమార్ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.