నగరంలోని వారసిగూడలో కిడ్నాప్ కు గురైన యువకుడు వారి చెరనుంచి తప్పించుకుని విస్తుగొలిపే విషయాలను వెల్లడించాడు.
సికింద్రాబాద్: నగరంలో శనివారం కిడ్నాప్ కు గురైన యువకుడు వారి చెరనుంచి తప్పించుకుని విస్తుగొలిపే విషయాలను వెల్లడించాడు. సికింద్రబాద్ వారసిగూడలో ఓ యువకుడు కిడ్నాప్ గురైన సంగతి తెలిసిందే. ఆ కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
తనను కొంతమంది కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వడానికి యత్నించారని పేర్కొన్నాడు. అందులో భాగంగానే తనపై కిడ్నాపర్లు కుంకుమ, పసుపు చల్లి నరబలికి యత్నించారన్నాడు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.