
జగన్నాథ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్/రాయికల్ (జగిత్యాల): జగిత్యాలలో మంత్రాల నెపంతో ముగ్గురు వ్యక్తులను పాశవికంగా హతమార్చిన ఘటన మరువకముందే అలాంటి దృశ్యం పునరావృతం అవుతుందంటూ వెలిసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఇటీవల మంత్రాల నెపంతో జగిత్యాలకు చెందిన వడ్డీ వ్యాపారి జగన్నాథం నాగేశ్వర్‌రావు అతని ఇద్దరు కుమారులను కులసంఘం సమావేశంలోనే హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 8 మందిని అదే తరహాలో హతమారుస్తామంటూ.. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లో ఫ్లెక్సీ వెలిసింది.
ఇది స్థానికులను కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రామంలో 8 మంది మాంత్రికులు ఉన్నారని, వారు తీరు మార్చుకోకపోతే చంపుతామని అందులో హెచ్చరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, ఎస్సై కిరణ్‌కుమార్ ఊరిలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ఎవరికైనా ప్రాణభయం ఉన్నా, బెదిరింపులు వచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. దీంతో గ్రామానికి చెందిన ఎనిమిది మంది గిరిజనులు తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు.
(చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు)
Comments
Please login to add a commentAdd a comment