Lock Upp: Payal Rohatgi Says She Did Vashikaran Puja for Save Her Career - Sakshi
Sakshi News home page

Lock Upp: వశీకరణం చేశాను: షాకింగ్‌ సీక్రెట్‌ బయటపెట్టిన హీరోయిన్‌

Published Mon, Mar 28 2022 12:54 PM | Last Updated on Fri, Apr 8 2022 3:25 PM

Lock Upp: Payal Rohatgi Says She Did Vashikaran Puja for Save Her Career - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్‌. ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతూ సెన్సేషన్‌ అవుతున్నారు. తాజాగా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్‌ పాయల్‌ రోహత్గి ఓ భయంకరమైన సీక్రెట్‌ వెల్లడించింది.

'15 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకానొక సమయంలో నా కెరీర్‌ డల్‌ అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో కానీ నా కెరీర్‌ను పుంజుకునేలా చేయడానికి నేను చేతబడి చేశాను. ఢిల్లీలోని ఓ పూజారి సాయంతో చేతబడిలోని వశీకరణం అనే తాంత్రిక విద్యను చేశాను. కానీ దానివల్ల నాకు ఏమీ ఒరగలేదు. నా కెరీర్‌ను కాపాడుకునేందుకు వశీకరణం చేశానని ఎవరికైనా చెప్తే నన్ను చులకన చేసి మాట్లాడతారేమోనని భయపడ్డాను. బహుశా చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటివి నమ్మరేమో! ఒకవేళ నమ్మి చేతబడి చేయించినా ఆ విషయాన్ని గుట్టుగా దాచిపెడతారు' అని చెప్పుకొచ్చింది.

ఆమె రహస్యాన్ని విని బిగ్గరగా నవ్వేసిన కంగనా.. 'నీకు అందంతో పాటు టాలెంట్‌ కూడా ఉంది. నీకిలాంటి మంత్రతంత్రాలు అవసరం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఏదో చేతబడి చేశానని ఆరోపించారు. ఒక అమ్మాయి సక్సెస్‌ అందుకుందంటే జనాలు ఆ విజయాన్ని కూడా శంకిస్తారు. నువ్వీ సీక్రెట్‌ చెప్పి నీ ధైర్యాన్ని చాటుకున్నావు. కాకపోతే నువ్వు సంగ్రమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మరి ఇప్పుడిది విన్నాక నేనో మాంత్రికురాలిని ప్రేమించానని అతడు అనుకోడా?' అని ప్రశ్నించింది. దీనికి పాయల్‌ స్పందిస్తూ.. 'అతడు ఏది నమ్మాలనుకుంటున్నాడో అతడికే వదిలేస్తున్నాను. కానీ ఆ చేతబడి అతడిపై మాత్రం చేయలేదు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: రామ్‌చరణ్‌ లగ్జరీ ఇల్లు, ఫొటోలు వైరల్‌

 రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా కేజీఎఫ్‌ 2 ట్రైలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement