చేతబడి నెపంతో దారుణ హత్య
Published Fri, Jul 15 2016 4:27 PM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
రాజమహేంద్రవరం: చేతబడులు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. తూర్పు గోదావరి జిల్లా వై.రాయవరం మండలం ఇర్లవాడ గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంత్రాలు చేస్తున్నాడని కొందరు అనుమానించారు. ఈ విషయమై అతడితో గొడవపడి కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement