తోటలలో వేసిన క్షుద్ర పూజల ముగ్గు , పొలాల్లో ఆకతాయిలు పడేసిన మద్యం సీసాలు
వైఎస్‌ఆర్ జిల్లా ,పులివెందుల రూరల్ : పట్టణ పరిధిలోని భాకరాపురం సమీపంలోని పంట పొలాల్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రింగ్ రోడ్డు, హెలీప్యాడ్ ప్రాంతాల్లో గుర్తు తెలియని ఆకతాయిలు మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. పచ్చటి పొలాల్లో మద్యం తాగుతూ పంటలను నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment