CM Jagan Three Days Kadapa Tour: Today Live Updates Telugu - Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్‌

Published Fri, Dec 24 2021 8:41 AM | Last Updated on Fri, Dec 24 2021 10:15 PM

CM Jagan Three Days Kadapa Tour: 24th December Live Updates Telugu - Sakshi

3.35PM
8042 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం

ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

3.00PM
పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ: సీఎం జగన్‌
ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్‌
రూ. 147 కోట్లతో రూపాయలతో జగనన్న కాలనీ అభివృద్ధి.. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రెండు లక్షల రూపాయలు ఉంటుంది: సీఎం జగన్‌

2.40
జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకున్న సీఎం జగన్‌. అక్కడ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్‌

2.25PM
దీనిలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులు చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు..ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ ఏర్పాటు:చేయనున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

2.20PM
పులివెందుల ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన.
ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ. 110 కోట్ల పెట్టుబడులు.. 2112 మందికి ఉపాధి.

మహానేతకు ఘన నివాళి


11.00 AM
ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిని వైఎస్‌ భారతి

9.30 AM
ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రులు అంజాద్‌ భాషా, ఆదిమూలపు సురేష్‌, అప్పలరాజు ఉన్నారు.

09:25AM
►వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వైఎస్‌ విజయమ్మ నివాళులర్పించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

08:50AM
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పులివెందులలోని జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ నేటి పర్యటన వివరాలు ఇలా..
24వ తేదీ శుక్రవారం ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. 10 గంటలనుంచి 12.00 గంటలవరకు ఇడుపుపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొంటారు.   
మధ్యాహ్నం 2గంటలకు పులివెందులలోని ఏపీఐఐసీ భూముల వద్దకు చేరుకుంటారు.  
2.10 గంటలకు ఆదిత్య బిర్లా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు.  
2.40 గంటలకు జగనన్న హౌసింగ్‌ కాలనీకి చేరుకుని అక్కడ హౌసింగ్‌ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.  
3.35నుంచి 3.50గంటలవరకు పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు.  
3.55 గంటలకు పులివెందులలోని నూతన మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.  
4.15గంటలకు అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా ఉన్న ఆంధ్ర ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తారు.   
5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్‌వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులతో కాసేపు మాట్లాడి వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement